: ‘ఏపీ ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత’ ఆశలపై నీళ్లు... వచ్చే భేటీలో చర్చిద్దామన్న ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రాష్ట్రంలో నిరసన సెగలు తగులుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని కూడా చర్చించడానికి ఒప్పుకోలేదు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంశం టేబుల్ ఐటమ్‌గా ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి చర్చా జరగలేదు. ప్రస్తుతం చర్చించేందుకు తగిన సమయం లేదని, తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చిద్దామని మోదీ చెప్పారు. దీంతో ఈ అంశాన్ని వాయిదా వేశారు. తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చిస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు. ఈ రోజు ఆ అంశంపై చర్చజరుగుతుందని అందరూ భావించారు. అయితే, దానిపట్ల చర్చ జరగకపోవడం నిరాశను మిగిల్చింది.