: ఆంధ్రవాళ్లు మాలాగా ధైర్యవంతులనుకున్నా... ఇలా చేస్తారని ఊహించలేదు!: కేసీఆర్ కు స్వాగతాలపై వీహెచ్ కామెంట్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుపతి విమానాశ్రయం వద్ద, తిరుమల కొండపైన ఘన స్వాగతం లభించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఆంధ్రావాలా బాగో' అన్న కేసీఆర్ కు తిరుపతిలో ఇంతటి ఘన స్వాగతమా? అని ఆశ్చర్యపోయారు. ఆంధ్ర ప్రజలు కూడా మాలాగా ధైర్యవంతులు అనుకున్నానని... కానీ, ఇలా చేస్తారని ఊహించలేదని అన్నారు. ఆంధ్ర వాళ్లను బెదిరించి, భయపెట్టిన కేసీఆర్ కు... ఇంతటి మర్యాదలు చేయడం ఏమిటని వీహెచ్ ప్రశ్నించారు. కేసీఆర్, చంద్రబాబుల మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందనే విషయం... ఈ వ్యవహారంతో అర్థమవుతోందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేసిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ చేసిన తప్పు ఏమిటని వీహెచ్ ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ర్యాలీ చేయడం తప్పా? అని అన్నారు. పరిపాలనలో నిరంకుశత్వం పనికి రాదని చెప్పారు.

  • Loading...

More Telugu News