: పళనిస్వామిది మూన్నాళ్ల ముచ్చటేనా? తమిళనాడు సీఎంగా దినకరన్?.. సంకేతాలు అందించిన అన్నాడీఎంకే


తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా మధ్య బలాన్ని నిరూపించుకుని... పళనిస్వామి సీఎం కూర్చీలో కూర్చున్నారు. అయితే, ఈయన ముచ్చట మూన్నాళ్లే అని తెలుస్తోంది. సీఎం కుర్చీలో పళనిస్వామిని శశకళ ఎక్కువ రోజులు కూర్చోబెట్టే అవకాశం కనిపించడం లేదు. తన అక్క కుమారుడు దినకరన్ ను సీఎం సీట్లో కూర్చోబెట్టేందుకు శశికళ అప్పుడే కార్యాచరణ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఈ వాదనకు బలం చేకూర్చేలా అన్నాడీఎంకే దిండుగల్ జిల్లా నలకోట ఎమ్మెల్యే తంగదురై మాట్లాడుతూ, త్వరలోనే దినకరన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. జయలలిత ఉన్నప్పుడే పార్టీ కార్యక్రమాల్లో దినకరన్ చురుగ్గా ఉండేవారని ఆయన అన్నారు. తర్వలోనే ఆయన సీఎం అయ్యే తరుణం వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో పళనిస్వామి ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదని పార్టీ శ్రేణులు కూడా అంటుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News