: వెయ్యి నోట్లు వస్తాయన్న వార్తలను తోసి పుచ్చిన ఆర్థిక శాఖ !
మార్కెట్ లోకి వెయ్యి నోట్లు వస్తాయనే వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ వార్తలను నమ్మవద్దని, ఇవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. ప్రస్తుతం రూ.500 నోట్లు, ఇతర చిన్న నోట్లను సరిపడా ముద్రించడం పైనే దృష్టి సారించామని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. కొత్తగా రూ.1000 నోట్లు ముద్రించే ప్రణాళిక ఏదీ తమ ప్రభుత్వానికి లేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏటీఎంలలో నగదు కొరత గురించి వస్తున్న ఫిర్యాదులపై ఆయన స్పందించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో తమకు అవసరమైనంత మేరకే నగదు విత్ డ్రా చేసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.