: గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్!


గుంటూరు జిల్లా టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నేతల మధ్య ఏవైనా విభేదాలు, సమస్యలు ఉంటే ఇన్ చార్జి మంత్రితో మాట్లాడాలే తప్పా, బయటపడవద్దని సూచించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీడీపీ నేతల గురించి, వారి కుటుంబాలు, బంధువుల గురించి తనకు తెలుసని చంద్రబాబు తన నివాసంలో నిన్న నిర్వహించిన సమీక్షలో అన్నట్లు తెలుస్తోంది. వచ్చే సమీక్షా సమావేశం నిర్వహించేలోగా అన్నీ సర్దుకోవాలని జిల్లా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ పటిష్టంగా ఉండే నిమిత్తం సమీక్ష సమావేశాలను చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. అనంతపురం, విశాఖపట్టణం జిల్లాల్లో ఇప్పటికే ఈ తరహా సమీక్షలు నిర్వహించారు. తాజాగా, గుంటూరు జిల్లా నేతలతో ఈ సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News