: కాకతీయ ప్యాసింజర్ కు తప్పిన పెనుప్రమాదం.. మద్యం మత్తులో రైలు డ్రైవర్లు!
కాకతీయ ప్యాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా జనగామ దగ్గర రెడ్ సిగ్నల్ వేసి ఉన్నప్పటికీ రైలు ముందుకు వెళ్లిపోయింది. దీంతో, తక్షణం స్పందించిన రైల్వే అధికారులు రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. రెడ్ సిగ్నల్ క్రాస్ చేసిన డ్రైవర్లు ఇద్దరూ మద్యం తాగి ఉన్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ కు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, రైలులోని ప్రయాణికులను భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో తరలిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.