: మనందరికీ ఎంతో ఇష్టమైన నోటును చలామణిలోకి తెచ్చిన ఆర్బీఐ


ఒకప్పుడు మనందరి జేబుల్లో ఆ నోటు ఉండేది. కానీ, కొన్ని సంవత్సరాల నుంచి ఆ నోటు కనిపించడం కూడా లేదు. కొంత మంది మాత్రం ఆ నోటును గుర్తుగా, పదిలంగా దాచుకున్నారు. ఆ నోటు స్థానంలో కాయిన్ రావడంతో అది కనుమరుగయింది. అదే 'ఒక్క రూపాయి' నోటు. ఇప్పుడు తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ మళ్లీ దాన్ని చలామణిలోకి తెచ్చింది. కొత్త రూపాయి నోటును విడుదల చేసింది. ఈ నోటును చూసిన వారు మురిసిపోతున్నారు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చిన్నారులు కూడా ఆ నోటు చూసి సంబర పడుతున్నారు. మా కోసం చిన్న నోటు వచ్చిందంటూ కేరింతలు కొడుతున్నారు.

  • Loading...

More Telugu News