: టీడీపీ ఎమ్మెల్యే సుగుణను అడ్డుకున్న సెక్యూరిటీ!


తెలంగాణ సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు వెళ్లిన తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణకు నిన్న చేదు అనుభవం ఎదురైంది. ప్రత్యేక విమానంలో నిన్న సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు ఆమె అక్కడికి వెళ్లారు. అయితే, సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో, టీడీపీ నాయకులు ఎంత చెప్పినా సెక్యూరిటీ వినకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, అధికారులు జోక్యం చేసుకోవడంతో ఎమ్మెల్యే సుగుణను విమానాశ్రయంలోకి అనుమతించారు.

  • Loading...

More Telugu News