: రెండు తెలుగు రాష్ట్రాలూ చల్లగా ఉండాలని కోరుకున్నా: సీఎం కేసీఆర్
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను దీవించమని స్వామి వారిని కోరుకున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలూ బాగా అభివృద్ధి చెంది, భారతదేశంలోనే అగ్ర రాష్ట్రాలుగా పేరు తెచ్చుకోవాలని, అందరినీ చల్లగా చూడాలని స్వామి వారిని కోరుకున్నానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయని, అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని, అందరూ కలిసి పనిచేస్తారని కేసీఆర్ అన్నారు.