: నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీకి.. హీరో విశాల్ కు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్!
నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రముఖ సినీ నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన పోటీ చేయడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదని తేల్చి చెప్పింది. విశాల్ నామినేషన్‌ను ఎన్నికల అధికారి అంగీకరించడాన్ని సవాలు చేస్తూ నిర్మాతల సంఘం వేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు అది న్యాయ సమ్మతమేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి అయిన విశాల్ నిర్మాతల సంఘంలో కూడా పోటీకి దిగడం అన్యాయమని, రెండు సంఘాలకు ఒకే వ్యక్తి పనిచేయడం చట్టవిరుద్ధం కావడంతో ఆయన నామినేషన్‌ను తోసిపుచ్చాలని కోరుతూ నిర్మాతల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం విశాల్ పోటీ పడడంలో తప్పులేదని, ఎన్నికల అధికారి ఆయన నామినేషన్‌ను అంగీకరించడం న్యాయసమ్మతేమనంటూ తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుతో విశాల్ వర్గం సంబరాల్లో మునిగిపోయింది.