: ‘రోగ్’ టీజర్ ను విడుదల చేసిన పూరీ!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘రోగ్’ చిత్రం టీజర్ విడుదలైంది. పూరీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ టీజర్ ను మీరు ఇష్టపడతారని అనుకుంటున్నానని పూరీ ట్వీట్ చేశారు. కాగా, ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కు అభిమానుల స్పందన బాగుంది. ఇషాన్ సరసన అనూప్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అలీ, తులసి తదితరులు నటిస్తున్నారు.