: హెచ్1 బి వీసాలపై ప్రధాని మోదీ మాట్లాడారు: పీఎంవో
అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులను భయపెడుతున్న ‘హెచ్1బి వీసాలపై డొనాల్డ్ ట్రంప్ ఆంక్షల’ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించినట్లు పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగులను అమెరికాలోకి అనుమతించే విషయంలో కాస్త విశాల హృదయంతో ఆలోచించాలని ఆయన అన్నారని చెప్పింది. ఈ వీసాలను తగ్గిస్తే 150 బిలియన్ డాలర్ల భారత ఐటీ సేవల పరిశ్రమపై ప్రభావం ఉంటుందని ఆయన అమెరికాకు తెలిపారని పేర్కొంది.
అమెరికాకు సాఫ్ట్‌వేర్ ఎగుమతుల మీదే ఐటీ పరిశ్రమ అధికంగా ఆధారపడిందని పేర్కొన్నారని చెప్పింది. అమెరికా కాంగ్రెస్ నుంచి వచ్చిన 26 మంది సభ్యుల బృందంలో మాట్లాడిన మోదీ ఈ విషయంపై వారితో చర్చించారని తెలిపింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని పరిపుష్ఠం చేయడంలో నిపుణులైన భారతీయుల పాత్రను గురించి కూడా మోదీ మాట్లాడారని చెప్పింది.