: విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నిస్తా: మహ్మద్ సిరాజ్


విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలని తనకు ఉందని ఐపీఎల్ 10 కు సెలక్టయిన హైదరాబాద్ రంజీ ఆటగాడు బౌలర్ మహ్మద్ సిరాజ్ అన్నాడు. హైదరాబాద్ లో నిన్న జరిగిన ఐపీఎల్ వేలంలో రూ.2.6 కోట్లకు సిరాజ్ ను ‘సన్ రైజర్స్’ కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 5న ప్రారంభం కానున్న ఐపీఎల్ 10 సీజన్ లో తొలి మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం కల్పిస్తే విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పాడు. కాగా, కేవలం రూ.20 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన సిరాజ్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడగా, హైదరాబాద్ మెంటార్ లక్ష్మణ్ సూచనతో ‘సన్ రైజర్స్’ అతన్ని భారీ ధరకు దక్కించుకుంది.

  • Loading...

More Telugu News