: వాట్సప్‌లో సరికొత్త ఫీచర్
స్మార్ట్‌ఫోన్ యూజర్ల వద్ద ఇతర ఏ యాప్ ఉన్నా లేకున్నా తప్పకుండా కనిపించేది మాత్రం వాట్సప్. అంతగా ఆదరణ సంపాదించిన వాట్సప్ తమ యూజర్ల ముందుకు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ మరింత ఆకర్షిస్తోంది. తాజాగా ఆ మెసేజింగ్ యాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై ఫొటోలు, వీడియోలు, జిప్ ఇమేజ్‌లు, ఎమోజీలు స్టేటస్‌లో పెట్టుకోవచ్చు. యూజర్ల స్మార్ట్‌ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరికీ ఈ స్టేటస్ 24 గంటల పాటు కనిపించే సౌకర్యాన్ని వాట్సప్ కల్పించింది. ఈ సందర్భంగా వాట్సప్ ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా తమ యాప్‌ను 1.2 బిలియన్ మంది ఉపయోగిస్తున్నారని, వారందరికీ ఈ ఫీచర్‌ను త్వరలోనే అందించనున్నామని తెలిపారు.