: శ్రీకృష్ణ అతిథి గృహంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వైసీపీ నేతల సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ రోజు రాత్రి ఆయన అక్కడే బస చేస్తున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్‌రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలు కేసీఆర్‌తో అక్కడ భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు మాట్లాడుకుంటున్నారు.