: మళ్లీ పెరిగిన బంగారం ధర!


కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర నిన్న‌ రూ.180 తగ్గి పది గ్రాముల బంగారం ధ‌ర 29,700 రూపాయ‌ల‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ రోజు ప‌సిడిధ‌ర మ‌ళ్లీ పైకి ఎగిసింది. అంతర్జాతీయ పరిణామాలు, నగల వ్యాపారుల నుంచి డిమాండ్ కారణంగా ఈ రోజు ప‌దిగ్రాముల ప‌సిడి ధర పది గ్రాములకు రూ.250 పెరిగింది. దీంతో ఇక పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.29,950గా న‌మోదైంది. వెండి కూడా బంగారం బాట‌లోనే ప‌య‌నించి రూ. 50 పెరిగి కేజీ రూ.43,200గా న‌మోదైంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్ల వెండి ధర పెరిగినట్టు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News