: ఎస్పీలో సంక్షోభం ములాయం ఆడిన డ్రామా: అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు


సమాజ్ వాదీ పార్టీలో ఇటీవల తలెత్తిన సంక్షోభం ఓ డ్రామా అంటూ ఆ పార్టీ నేత అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభం అంతా కూడా ములాయం సింగ్ ఆడిన డ్రామా అని, తన కొడుకు అఖిలేశ్ ను మళ్లీ సీఎంగా చేసేందుకే ఆ డ్రామా ఆడారని, ములాయం సింగ్ పెద్ద స్క్రిప్ట్ రైటర్ అని, కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల పొత్తుకు కారణం కూడా ములాయం సింగేనని అమర్ సింగ్ వ్యాఖ్యానించారు. కాగా, ములాయం సింగ్ ఏది చెబితే అది చేస్తానని, ములాయం తనకు గుండె లాంటి వాడంటూ తరచుగా చెబుతుండే అమర్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News