: శ్రీలంక క్రికెటర్ డెక్విల్లాపై రెండు మ్యాచ్ ల నిషేధం


అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన శ్రీలంక క్రికెటర్ నిరోషాన్ డెక్విల్లాపై వేటు పడింది. డెక్విల్లాపై రెండు మ్యాచ్ ల నిషేధం విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం రెండేళ్ల లోపు 5 డీ మెరిట్ పాయింట్లు పొందిన ఆటగాడిపై రెండు మ్యాచ్ ల నిషేధం, మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తుంది. కాగా, జీలాంగ్ లో గత ఆదివారం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఫాల్కనర్ వేసిన బంతి డెక్విల్లా భుజాలను తాకుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. డెక్విల్లా అవుటై నట్లుగా అంపైర్ ప్రకటించాడు. దీంతో, అంపైర్ తీసుకున్న నిర్ణయంపై డెక్విల్లా అసహననం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News