: ఎవరేమనుకున్నా డోంట్ కేర్.. నచ్చిందే చేస్తా: అనుష్క శర్మ
ఎవరు ఏది చెప్పినా తాను పట్టించుకోనని... తనకు ఏది నచ్చితే అదే చేస్తానని బాలీవుడ్ నటి అనుష్క శర్మ చెప్పింది. తనకు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడే సినీ నిర్మాతగా మారాలనుకున్నానని... కానీ, అందరూ నీకేమైనా పిచ్చా, హీరోయిన్ గా మంచి పొజిషన్ లో ఉన్నావు... నిర్మాతగా మారిన తర్వాత హీరోయిన్ గా చేయడానికి ఏమీ ఉండదని చెప్పారని తెలిపింది. అయితే తాను మాత్రం ఎవరి సలహాలను పట్టించుకోకుండా నిర్మాతగా మారిపోయానని... ఇప్పుడు రెండు రంగాల్లో కూడా రాణిస్తున్నానని చెప్పింది. తాను చేస్తున్న పని సరైనదని అనుకుంటే చాలు... చేసేస్తానని తెలిపింది. ప్రస్తుతం అనుష్క వయసు 28 సంవత్సరాలు.