: సయీద్ ను ఉగ్రవాది అన్నందుకు.. పాక్ రక్షణ మంత్రిపై ముప్పేట దాడి!


ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ను ఉగ్రవాదిగా సంబోధించినందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఒక్కరోజులోనే తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 'భారత దేశానికి ప్రతినిధి ఖ్వాజా' అంటూ పాక్ లోని వివిధ పార్టీల నేతలు, మత సంస్థల నాయకులు మండిపడ్డారు. హఫీజ్ సయీద్ దేశభక్తుడని కొనియాడారు.

జర్మనీలోని మ్యూనిక్ నగరంలో జరిగిన అంతర్జాతీయ భద్రత సదస్సులో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, హఫీజ్ సయీద్ వల్ల తమ దేశానికి పెను ముప్పు ఉందని చెప్పారు. సమాజానికి అత్యంత ప్రమాదకరంగా సయీద్ పరిణమించాడని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేత మహ్మదూర్ రషీద్ మాట్లాడుతూ, ఆయన పాక్ రక్షణ మంత్రిలా మాట్లాడలేదని... భారత రక్షణ మంత్రిలా మాట్లాడారని విమర్శించారు. పాక్ మాజీ ప్రధాని మహ్మద్ అట్టిఖ్ తో పాటు జమాతే ఇస్లామీ కూడా రక్షణ మంత్రిపై మండిపడింది. మరోవైపు, జమాతుల్ దవా సంస్థ దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించింది.

  • Loading...

More Telugu News