: ‘గ్రేట్ ఛాయిస్’ అన్న జమైకా చిరుత.. ‘థ్యాంక్స్ లెజెండ్’ అని చెప్పిన కోహ్లీ!


‘ప్యూమా’కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎనిమిదేళ్ల పాటు ఉండేందుకు టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీకి జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ అభినందనలు తెలిపాడు. బోల్ట్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ..‘విరాట్ కోహ్లీ.. గ్రేట్ ఛాయిస్. మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఇదే సరైన సమయం’ అని పేర్కొన్నాడు.

ఈ ట్వీట్ పై ప్రతి స్పందించిన కోహ్లీ..‘ ఏదో ఒక రోజున మీ అంత వేగంగా పరిగెత్తుతానని ఆశిస్తున్నా. థ్యాంక్స్ లెజెండ్’ అని అన్నాడు. కాగా, అంతర్జాతీయ క్రీడాకారులు ఉసేన్ బోల్ట్, అసాఫా పావెల్, థియెరీ హెన్రీ లు ప్రస్తుతం ‘ప్యూమా’కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, ‘ప్యూమా’ తో రూ.110 కోట్ల మొత్తానికి కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రముఖ సంస్థ ‘అడిడాస్’తో మూడేళ్ల కాలానికి కోహ్లీ కుదుర్చుకున్న ఒప్పందం ముగిసిపోవడంతో తాజాగా ‘ప్యూమా’ సంస్థ తో ఈ ఒప్పందం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News