: మణిపూర్ డిప్యూటీ సీఎం కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి!
మణిపూర్ డిప్యూటీ సీఎం గైఖంగమ్ కాన్వాయ్ పై ఉగ్రవాదులు డాడి చేశారు. నోనీ జిల్లాలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఈ ఘటనలో ఓ ఐఆర్బీ జవాను మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి తెగబడ్డ ఉగ్రవాదుల కోసం గాలింపును ప్రారంభించాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.