: బాధ్యతలు స్వీకరించిన ‘టాటా సన్స్’ కొత్త చైర్మన్ చంద్రశేఖరన్
‘టాటా సన్స్’ కొత్త చైర్మన్ గా ఎన్. చంద్రశేఖరన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టాటా సంస్థల్లో తానూ ఒకడిని అయినందుకు చాలా గర్వ పడుతున్నానని, అన్ని గ్రూప్ లతో కలిసి పనిచేసేందుకు కృషి చేస్తానని, వ్యాపారవేత్తలందరితో కలిసి తమ గ్రూప్ పనిచేస్తుందని అన్నారు. రతన్ టాటా మాట్లాడుతూ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓగా ఆయన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారని, రానున్న సంవత్సరాలలో టాటా గ్రూప్ కు మరింత గౌరవాన్ని ఆయన తీసుకువస్తారని తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు. అంతకుముందు, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా ‘బాంబే హౌస్’కు వెళ్లారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా, మాజీ చైర్మన్ జేఆర్ డి టాటాల విగ్రహాలకు రతన్ టాటా, చంద్రశేఖరన్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.