: కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసిన రోజా
గన్నవరం కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రైవేట్ కేసును దాఖలు చేశారు. అమరావతిలో జరిగిన మహిళా సదస్సుకు హాజరవడానికి వచ్చిన తనను చట్ట విరుద్ధంగా అడ్డుకున్నారని, అక్రమంగా నిర్బంధించారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. సదస్సుకు తనను ఆహ్వానించి, ఆ తర్వాత నిర్బంధించి, అవమానించడం అత్యంత దారుణమని తెలిపారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.