: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ భాస్కర రామారావుకు స్వల్ప గాయాలు
ఏపీ శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు ఈ రోజు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నవాబుపాలెం గుండా వెళుతోన్న ఆయన కారు లారీని ఢీ కొంది. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మరెవరికీ గాయాలు కాలేదు. సదరు ఎమ్మెల్సీ మరో కారులో వెళ్లినట్లు తెలుస్తోంది.