: శశికళ కోరికల్లో రెండింటికి ఓకే చెప్పిన న్యాయస్థానం!


తమిళనాడు చిన్నమ్మ శశికళా నటరాజన్ గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం వాటిల్లో రెండు కోరికలు తీర్చేందుకు అంగీకరించింది. వాటి వివరాల్లోకి వెళ్తే... శశికళ తనకు ప్రత్యేకంగా గది కేటాయించాలని, అందులో ప్రత్యేకమైన టీవీ, డబుల్ కాట్ బెడ్, వెస్ట్రన్ కమోడ్, ఇంటి భోజనం, తన బాగోగులు చూసుకునేందుకు జైల్లో పనిమనిషి, తమిళనాడు వార్తా పత్రికలు అందుబాటులో ఉండాలని కోరిన సంగతి తెలిసిందే.

వీటిపై మండిపడ్డ న్యాయమూర్తి, సాధారణ జైలు జీవితం అంటే తెలుసా? అని ప్రశ్నించారు. ఆమెకు ఎలాంటి అదనపు సౌకర్యాలు కల్పించవద్దని జైలర్ ను పిలిచి మరీ ఆదేశించారు. అయితే తనకు జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కావాలంటూ ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో దానిని పరిశీలించి, విచారించిన న్యాయమూర్తి...ప్రాణహాని ఉందని ఆరోపించిన నేపథ్యంలో ఆమెకు ఒక గది కేటాయించాలని అధికారులను సూచించారు. అలాగే షుగర్ పేషంట్ కావడంతో ఆమెకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించలేమని, అయితే ఇంటి నుంచి భోజనం తెప్పించుకుంటే తీసుకోవచ్చని తెలిపారు. దీంతో ఆమె రూం, భోజనం కోరికలు నెరవేరాయి. 

  • Loading...

More Telugu News