: నైపుణ్యంతోనా, స్లెడ్జింగ్ తోనా? దేనికైనా రె'ఢీ': ఆసీస్ కు అజంక్యా రహానే సవాల్
ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టు ప్రణాళికలపై టీమిండియా టాపార్డర్ ఆటగాడు అజింక్యా రాహానే మాట్లాడాడు. ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొనేందుకు జట్టు మొత్తం సిద్ధంగా ఉందని అన్నాడు. స్లెడ్జింగ్ అయినా, నైపుణ్యంలో అయినా ఆసీస్ కు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. ఆస్ట్రేలియాలోని ప్రతి ఆటగాడిని లక్ష్యం చేసుకుని ప్రణాళికలు రచించామని చెప్పాడు. అయితే వాటిని వివరించలేనని చెబుతూ, ఆటలో అయినా, స్లెడ్జింగ్ లో అయినా ప్రతి ఆటగాడికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయని రహానే తెలిపాడు. ఈ సిరీస్ మరింత ఆసక్తికరంగా జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నాడు. నాలుగు టెస్టుల్లో ఆసీస్ పై ఆధిక్యం ప్రదర్శిస్తానని రహానే తెలిపాడు.