: 'కాటమరాయుడు'కి ఆడియో ఫంక్షన్ లేదా?


ఈ మధ్య కాలంలో మెగా హీరోలు కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు ఉంది. అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు', రామ్ చరణ్ 'ధృవ', చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', తాజాగా సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలకు ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తాజగా అభిమానులకు కొత్త డౌట్ వస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించకుండా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారా? అనేదే ఆ డౌట్. పాటలను డైరెక్ట్ గా విడుదల చేసి, ఆ తర్వాత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలనే యోచనలో చిత్ర యూనిట్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, తన ఫ్యామిలీ హీరోల బాటలోనే పవన్ కూడా వెళతాడని అంటున్నారు.

  • Loading...

More Telugu News