: షాపింగ్ మాల్ పై కూలిన ఛార్టర్డ్ ఫ్లైట్!
ఆస్ట్రేలియాలో ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ షాపింగ్ మాల్ పై కూలింది. మెల్ బోర్న్ నుంచి టాస్మేనియా సమీపంలోని కింగ్ ఐలాండ్ కు ఐదుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఈ ఛార్టర్డ్ ఫ్లైట్ ఈ ఉదయం తెల్లవారు జామున ఎస్సెన్ డన్ ఎయిర్ పోర్టు నుంచి ఎగిరిన కాసేపటికే ఇంజిన్ లోని సాంకేతిక లోపంతో షాపింగ్ మాల్ పై అది కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో షాపింగ్ మాల్ దెబ్బతినగా, విమానం మంటల్లో పేలిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో షాపింగ్ మాల్ పరిసరాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విజువల్స్ ను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. మృతులు ఏ దేశవాసులు? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.