: ఇంకా నయం.. ఎవరెస్ట్‌పై ర్యాలీ చేసుకోమనలేదు..!: పోలీసుల తీరుపై కోదండరాం వ్యంగ్యం


రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నిరుద్యోగుల నిరసన ర్యాలీని నిర్వహించుకోవాలన్న పోలీసుల ప్రతిపాదనపై టీజేఏసీ చైర్మన్‌ ఎం.కోదండరాం వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘‘ఇంకా నయం.. ఎవరెస్ట్ శిఖరం మీద చేసుకోమన్నారు కాదు’’ అని ధ్వజమెత్తారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఫలితం ఉండబోదన్నారు. ర్యాలీని శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగానికి లోబడి నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. ర్యాలీ పూర్తయ్యే వరకు నిద్రపోబోమని తేల్చి చెప్పారు. జేఏసీ ఆవిర్భావం తర్వాత ఎన్ని ఉద్యమాలు జరిగాయో, ఎలా జరిగాయో కూడా అందరికీ తెలిసిన విషయమేనని కోదండరాం పేర్కొన్నారు. అటువంటిది ఇప్పుడు ఊరిబయట ర్యాలీలు చేసుకోమనడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News