: ట్వీట్లతో దూసుకుపోతున్న కమల్.. కేసు పెట్టించిన అన్నాడీఎంకే
తమిళనాట రాజకీయ సంక్షోభం మొదలైన దగ్గరి నుంచి నిత్యం ట్వీట్లతో ప్రజల మధ్యన ఉంటున్న ప్రముఖ నటుడు కమలహాసన్‌ను అడ్డుకునేందుకు అన్నాడీఎంకే పావులు కదుపుతోంది. ఇండియన్ నేషనల్ లీగ్ నాయకుడు ఫిర్దోస్‌తో ఆయనపై కేసు పెట్టించింది. పళనిస్వామి బలపరీక్ష రోజు హింసను ప్రేరేపించేలా కమలహాసన్ ట్వీట్లు చేశారంటూ ఫిర్దోస్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
తమిళ రాజకీయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కమల్ ‘మీ ఆగ్రహాన్ని ఈ మెయిల్ ద్వారా గవర్నర్‌కు తెలియజేయండి’ అని పేర్కొంటూ రాజ్‌భవన్ ఈ-మెయిల్ ఐడీని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆయన పిలుపుతో అభిమానులు రెచ్చిపోయారు. రాజ్‌భవన్‌కు వేలాది ఈ-మెయిళ్లు పంపించారు. దీంతో ఆయన దూకుడును అడ్డుకోవాలని భావించిన అన్నాడీఎంకే ప్రత్యక్షంగా కంటే పరోక్షంగా ఎదుర్కోవాలని భావించింది. అందులో భాగంగా ఫిర్దోస్‌తో కేసు పెట్టించింది.