: వచ్చే నెల నుంచి ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశ


వచ్చే నెలలో ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ రెండో దశను ప్రారంభించేందుకు ఆదాయపు పన్ను శాఖ సిద్ధమవుతోంది. గతేడాది నవంబరు 8 తర్వాత జరిగిన బ్యాంకు లావాదేవీల్లో 9 లక్షల ఖాతాలు అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించిన ఐటీ శాఖ అందుకు సంబంధించిన వివరాలు సేకరించే పనిలో పడింది. ఇందులో భాగంగా రూ.5 లక్షలకు మించి ఖాతాల్లో జమ చేసిన వారి వివరాలను సేకరించింది. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ 18 లక్షల మందికి ఈ-మెయిళ్లు, ఎస్ఎంఎస్‌ల ద్వారా ప్రశ్నించింది. అయితే కొందరు మాత్రమే స్పందించి సమాధానం ఇచ్చారు.  9 లక్షల ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో వచ్చే నెల నుంచి ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రానున్న పది రోజుల్లో డిపాజిట్ల డేటాను విశ్లేషించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News