: తిరుమల శ్రీవారికి కేసీఆర్ సమర్పించనున్న కానుకల వివరాలు!
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న కేసీఆర్ ఉద్యమం నాటి మొక్కులు తీర్చుకోనున్న సంగతి తెలిసిందే. ఉద్యమం కల సాకారమై, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలను సమర్పిస్తానని కేసీఆర్ మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను ఆయన టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో కేరళలోని జొస్ అలుక్కాస్ ఆభరణాల దుకాణంలో శ్రీవారి కోసం ప్రత్యేకంగా నగలను డిజైన్ చేయించి తయారు చేయించారు. శ్రీమూలవర్ణ కమలం నమూనాలో 14.2 కేజీల సాలగ్రామ హారంతో పాటు 4.65 కేజీల విలువైన బంగారంతో ఐదు పేటల కంఠాభరణాన్ని తయారు చేయించారు. ఓ ముక్కుపుడకను కూడా తయారు చేయించారు. ఈ కానుకలను రేపు ఉదయం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీవారికి సమర్పించనున్నారు.