: ఒక చిన్నారిని దత్తత తీసుకుంటాను: మనీషా కొయిరాలా
తాను అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే ఒక చిన్నారిని దత్తత తీసుకుంటానని ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా చెప్పింది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ఈ డిసెంబర్ వస్తే నేను కేన్సర్ బారి నుంచి పూర్తిగా కోలుకుని ఐదేళ్లు అవుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే .. ఒక బేబి గర్ల్ ని దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాను. చిన్నారిని దత్తత తీసుకుంటే, ఈ కొత్త జీవితం ఎలా ఉంటుందనే ఉత్సాహంతో ఉన్నాను. కొత్త కోణంలో నా జీవితాన్ని చూస్తాను. నా జీవిత పాఠాలను, నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని ఆ చిన్నారికి అందిస్తాను. దేవుడు సృష్టి లో ఉన్న అంతులేని అందం గురించి ఆ చిన్నారికి తెలియచెబుతాను’ అని మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది.