: ఆ పుకార్లు విని గట్టిగా నవ్వుకున్నాను: నటి ఫరీదా జలాల్


తనపై పుకార్లు విని గట్టిగా నవ్వుకున్నానని బాలీవుడ్ నటి ఫరీదా జలాల్ చెప్పింది. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమె చనిపోయిందనే వార్తలు ఇటీవల హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలో అరవై ఏడు సంవత్సరాల ఫరీదా జలాల్ స్పందిస్తూ, ఇటువంటి పుకార్లు ఎలా పుడతాయో అర్థం కావట్లేదని, వాటిని విని గట్టిగా నవ్వుకున్నానని చెప్పింది. ఈ విషయమై తెలుసుకునేందుకు తన ఇంటికి అదే పనిగా ఫోన్లు చేస్తుండేవారని, దీంతో, చికాకు పుట్టేదని, తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఫరీదా జలాల్ తెలిపింది. కాగా, 'సర్గోషియాన్' చిత్రంలో ప్రస్తుతం ఆమె నటిస్తోంది. 

  • Loading...

More Telugu News