: బెన్ స్టోక్స్ కోసం చాలా పెద్ద రిస్క్ చేశాం: స్టీఫెన్ ఫ్లెమింగ్


ఇంగ్లండ్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను పూణే సూపర్ జెయింట్స్ 14.5 కోట్ల రూపాయల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెన్ స్టోక్స్ కొనుగోలుపై ఆ జట్టు కోచ్, న్యూజిలాండ్ జట్టు దిగ్గజ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ, బెన్ స్టోక్స్ ను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసి చాలా పెద్ద రిస్క్ చేశామని అన్నాడు.

గత సీజన్ లో జట్టులో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదని, దీంతో అంతర్జాతీయ స్థాయి అనుభవమున్న ఆటగాడు జట్టుకు అవసరమని భావించామని, అందుకే అంత రిస్క్ చేశామని చెప్పాడు. రిస్క్ అన్న పదం ఎందుకు వాడుతున్నానంటే 14.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ఒక ఆటగాడిపై వెచ్చించడం అంటే రిస్కేనని అన్నాడు. ఆటగాడు సీజన్ లో విఫలమైతే ఆ మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుందని, తన విలువను ఆటగాడే పెంచుకోవాల్సి ఉంటుందని స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. ఈ సారి పూణే జట్టులో పలు మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ ధోనీ స్థానంలో స్టీవెన్ స్మిత్ ను కెప్టెన్ గా నియమించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News