: వచ్చేనెలలో అమరావతిలో పర్యటిస్తా: పవన్ కల్యాణ్ హామీ
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరులోని హాయ్ ల్యాండ్ లో రాజధాని ప్రాంత రైతులతో భేటీ అయి వారి కష్టాలను గురించి తెలుసుకున్నారు. ఉండవల్లి, పెనుమాక ప్రాంత రైతులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ వచ్చే నెల రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. రైతులు పవన్ కల్యాణ్‌కు వినతి పత్రం అందించారు. తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. తమ సమస్యలకు ఓ పరిష్కారం కావాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు పవన్‌ని కోరారు.