: సినీనటి భావన కిడ్నాప్ నేపథ్యంలో.. 2010 మంది గూండాలను అరెస్టు చేయమని కేరళ సీఎం ఆదేశం!
కేరళలోని ఎర్నాకుళంలో సినీనటి భావన కిడ్నాప్ ఉదంతం దేశ వ్యాప్తంగా అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ ప్రముఖుల నుంచి సామాన్య ప్రజలవరకు స్పందిస్తున్నారు. మరోవైపు కేరళలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలో ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. ఆయన వద్దే హోంశాఖ కూడా ఉండడంతో ఆయన పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ జాబితాలో వున్న మొత్తం 2010 మంది గూండాలను నెల రోజుల్లోగా అరెస్టు చేయాలని ఆదేశించారు. వారిపై మొత్తం 14 జిల్లాల్లో కేసులు ఉన్నాయి. సంఘవిద్రోహ శక్తుల చట్టం కింద అరెస్టులు మొదలు పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.