: శశికళ భర్త నటరాజన్ కు మొదలైన కేసుల గండం
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఆమె భర్త నటరాజన్ కు కూడా కష్టకాలం మొదలైంది. పాత కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. గతంలో సీబీఐ ఆయనపై నమోదు చేసిన కేసులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి. 1994లో లెక్సస్ కార్ల దిగుమతికి సంబంధించి సీబీఐ, ఈడీలు నటరాజన్ సహా మరో ముగ్గురిపై వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. అయితే, గత ఐదేళ్లుగా అప్పీళ్లతో నటరాజన్ ముందుకెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో, కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలని ఇటీవలే మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సీబీఐకి మెమోలు పంపించారు. ఈ క్రమంలో ఈ కేసు చివరి విచారణ ఈ నెల 27న జస్టిస్ భాస్కరణ్ ధర్మాసనం ముందు జరగనుంది.