: గన్నవరం చేరుకున్న పవన్ కల్యాణ్
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద కొనసాగుతున్న చేనేత సత్యాగ్రహం, ఐక్య గర్జనలో పాల్గొనడానికి సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన భారీ బందోబస్తు మధ్య గుంటూరుకి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో ఈ సత్యాగ్రహం కొనసాగుతోంది. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ చేనేత కార్మికులు ఈ సత్యాగ్రహంలో పాల్గొంటున్నారు. సత్యాగ్రహంలో దాదాపు 70 వేల మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం పవన్ చేనేత కార్మికుల కష్టాల గురించి మాట్లాడనున్నట్లు సమాచారం.