: బెంగళూరులో ధనికులుండే ప్రాంతంలో ఎయిర్ హోస్టెస్ కు లైంగిక వేధింపులు!


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నగరంగా పేరు పొందిన బెంగళూరు మరోసారి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధనవంతులు నివాసముండే హెచ్ఆర్బీఆర్ లేఅవుట్ లో జరిగిన ఓ షాకింగ్ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. 'టైమ్స్ ఆఫ్ ఇండియా' కథనం ప్రకారం, ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఓ ఎయిర్ హోస్టెస్ 12వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో లైంగిక వేధింపులకు గురైంది. డిన్నర్ ముగించుకుని ఇంటికి వస్తుండగా, ముఖానికి హెల్మెట్ ధరించి వచ్చిన ఓ బైకర్, ఎయిర్ హోస్టెస్ ను అటకాయించి, నడిరోడ్డుపై ఆమె దుస్తులను చించి వేశాడు. ఆపై ఆమెపై అఘాయిత్యానికి దిగాడు. బాధితురాలు కేకలు పెట్టడంతో బైకర్ పారిపోయాడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు అయ్యాయి. రెండు రోజుల తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, బనాస్ వాడీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News