: ‘సోనీ ఎక్స్ పీరియా ఎక్స్’ ధర భారీగా తగ్గింపు!
సోనీ సంస్థకు చెందిన టాప్ మోడల్ స్మార్ట్ ఫోన్ ఎక్స్ పిరియా ఎక్స్ ధర మరోమారు భారీగా తగ్గింది. భారత వినియోగదారుల కోసం దీని ధరను గతంలో పదివేల వరకు తగ్గించింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు ఉండకపోవడంతో మరోమారు ధరను తగ్గించింది. తాజా తగ్గింపు ప్రకారం, ఎక్స్ పిరియా ఎక్స్ ధర పద్నాలుగు వేల రూపాయల వరకు తగ్గింది. రూ.48,900 గా ఉన్న ఈ ఫోన్ ధరను తగ్గించడంతో కేవలం రూ.24,990కే వినియోగదారులకు ఇది అందనుంది. కాగా, ఎక్స్ పిరియా ఎక్స్ ఫీచర్ల విషయాని కొస్తే... 5 అంగుళార ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 23 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.