: బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సతీ వియోగం!
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సతీమణి సావిత్రి (54) మృతి చెందారు. హైదరాబాద్ తార్నాకలోని స్వగృహంలో ఈ రోజు ఉదయం ఆమె మృతి చెందినట్లు సావిత్రి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, రామచంద్రరావు సతీమణి మృతిపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తమ సంతాపం తెలిపారు. రామచంద్రరావు నివాసానికిమంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ప్రభాకర్ వెళ్లి ఆయన్ని పరామర్శించారు.