: నెరవేరనున్న రామానాయుడి కోరిక!
ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ దివంగత రామానాయుడి కోరిక నెరవేరనుంది. తన కుమారుడు వెంకటేష్, మనవళ్లు రానా, చైతన్యలతో ఓ మల్టీస్టారర్ సినిమా తీయాలనేది రామానాయుడి కోరిక. ఇప్పుడు ఆయన కోరికను ఆయన పెద్ద కుమారుడు సురేష్ బాబు నెరవేర్చబోతున్నారు. తన తండ్రి కోరికను త్వరలోనే నెరవేర్చబోతున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే, ఈ సినిమా ఎంత త్వరగా సెట్ మీదకు వస్తుందో వేచి చూడాలి.