: భారత్, పాక్ లకు నీతులు చెబుతోన్న అగ్రరాజ్యం


కొన్ని దశాబ్దాల క్రితమే అణ్వాయుధ పోటీకి తెరదీసి సామ్రాజ్యవాదంతో రెచ్చిపోదామనుకున్న అగ్రరాజ్యం అమెరికా కాలక్రమంలో కాసింత సంయమనం పాటించడం అలవర్చుకుంది. ఆ క్రమంలో పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సూక్తులు చెప్పడమూ నేర్చుకుంది. తాజాగా, దక్షిణాసియాలో అణ్వాయుధ పోటీ పెచ్చుమీరుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే, భారత్, పాకిస్తాన్ లు తమ అణు, క్షిపణి కార్యక్రమాలను కట్టిపెట్టాలని బోధిస్తోంది. తద్వారా అణ్వాయుధ రహిత ప్రపంచాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించాలని సూచించింది. జెనీవాలో జరిగిన ఓ సదస్సులో అమెరికా అంతర్జాతీయ భద్రత సహాయ కార్యదర్శి థామస్ కంట్రీమాన్ పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News