: మా అమ్మాయి నన్ను కూడా సింగర్ గా గుర్తించింది!: యాంకర్ సుమ
తమ అమ్మాయి కూడా తనను ఓ సింగర్ గా గుర్తించిందని, తన జన్మధన్యమైందని ‘విన్నర్’ సినిమాలో పాట పాడిన ప్రముఖ టీవీ యాంకర్ సుమ చిరునవ్వు చిందించింది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఇంట్లో తాను ఎప్పుడైనా పాట పాడుతుంటే, పాడొద్దు అంటూ తమ కూతురు గొడవ చేస్తుందని చెప్పింది. ఎందుకంటే, సంగీతం నేర్చుకుంటున్న తన కూతురికి పాట ఎలా పాడాలో తెలుసని, తానేమో, తన ఇష్టం వచ్చినట్లు పాడే దానినని, దీంతో, పాడొద్దు అంటూ గొడవ చేసేదని చెప్పుకొచ్చింది.
అయితే, ‘విన్నర్’ సినిమాలో పాట పాడిన తర్వాత తనను కూడా ఓ సింగర్ గా తన కూతురు గుర్తించిందంటూ సుమ చెప్పింది. మరో విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి తాను పాట పాడాలనే కోరిక తన తల్లికి మొదటి నుంచి ఉండేదని, ఆమె సంకల్పబలం వల్లే తనతో పాట పాడించి ఉంటుందని సుమ పేర్కొంది.