: పన్నీర్ వర్గం నుంచి ఆర్కే నగర్ బరిలో దీప ఖరారు!
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో పన్నీర్ సెల్వం పార్టీ తరఫున జయలలిత మేనకోడలు దీపా రాజకుమార్ పేరు అప్పుడే ఖరారైపోయింది. ఈ నియోజకవర్గానికి త్వరలో ఎన్నికలు జరగనునుండగా, దీపను పోటీకి దింపాలని పన్నీర్ వర్గం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్న సంగతి తెలిసిందే. ఇక దీప కూడా తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఆపై జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో, ఆమెనే తమ పార్టీ తురుపు ముక్కగా ప్రయోగించాలని పన్నీర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.