: 300 సీట్లలో గెలవబోతున్నాం: మాయావతి
యూపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 300 సీట్లలో తమ పార్టీ విజయం సాధించబోతున్నదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం లక్నోలోని పోలింగ్ బూతు నంబర్ 251కి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ తమకు రానుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. కాగా, నేడు మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 69 స్థానాలకు ఓటింగ్ జరుగుతూ ఉండగా, హోం మంత్రి రాజ్ నాథ్ సొంత నియోజకవర్గమైన లక్నో, సమాజ్ వాదీకి గట్టి పట్టు, యాదవులు అధికంగా ఉన్న కన్నౌజ్, మైన్ పురి, ములాయం సొంత జిల్లా ఇటావా తదితర ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.