: ఈ స్కేలు ధరెంతో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!


ఈ స్కేలు ధర తెలిస్తే నిజంగానే అవాక్కవుతారు. 15 సెంటీమీటర్లు ఉన్న ఈ చిన్న స్కేలు ధర అక్షరాలా 12 వేల రూపాయలు. అంటే సెంటీమీటర్‌కు రూ.737 అన్నమాట. లగ్జరీ బాండ్లకు పెట్టింది పేరైన ‘లూయిస్ ఉటన్’(ఎల్వీ) ఈ స్కేలును తయారు చేసింది. విద్యార్థుల కోసం అత్యంత నాణ్యంగా స్కేళ్లను తయారుచేస్తున్న సంస్థ ఇందుకోసం లెదర్‌ను వాడుతోంది. స్కేలు అందంగా ఉండేందుకు పూల డిజైన్ కూడా ఏర్పాటు చేశారు. స్కేలుతోపాటు లెదర్ కోటెడ్‌తో తయారుచేసిన ఒక్కో పెన్సిల్‌ను పదివేల రూపాయలకు విక్రయిస్తోంది. పెన్సిల్ పెట్టుకునే పౌచ్‌ ధర రూ.22 వేలు. మరి  ఇంత ధర పెట్టి ఎవరు కొనుగోలు చేస్తారనే కదా? మీ అనుమానం. తమ వినియోగదారులు తమకుంటారని ధీమాగా చెబుతోంది ఎల్వీ కంపెనీ.

  • Loading...

More Telugu News