: హైదరాబాదు ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్లో ప్రియాంకా గాంధీ


ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కుమార్తె, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ అకస్మాత్తుగా హైదరాబాదులో దర్శనమిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడి పుంజుకుంటున్న దశలో అమేధీలో జరిగిన బహిరంగ సభలో సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ...అకస్మాత్తుగా హైదరాబాదులోని ఎల్వీప్రసాద్ కంటి ఆసుపత్రిలో కనిపించారు. భర్త, కుమారుడితో కలిసి ఆమె ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్ కి వచ్చారు. అక్కడ తన కుమారుడు రెహాన్ కు కంటి ఆపరేషన్ చేయించారు. రెహాన్ కు ఆపరేషన్ చేయించేందుకు వచ్చిన ఆ దంపతులు ఆపరేషన్ పూర్తి కాగానే తిరిగి ఢిల్లీ ప్రయాణమయ్యారు. 

  • Loading...

More Telugu News